ఏపీలో వైసీపీదే అధికారం… ఎన్ఏఐ సంచ‌ల‌న స‌ర్వే

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌ళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తేల్చేసింది ఎన్ఏఐ స‌ర్వే సంస్థ‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటీవ‌ల ప‌లు సంస్థ‌లు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నాయి.ఇదే క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎవ‌రు అధికారంలోకి రానున్నార‌న్న అంశంపై ఎన్ఏఐ నిర్వ‌హించిన తాజా స‌ర్వేలో మ‌ళ్ళీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేప‌ట్ట‌బోతోంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.వైసీపీ మ‌ళ్ళీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించ‌బోతున్న‌ట్లు ఈ స‌ర్వేలో తేలింది. వైసీపీ 127 సీట్ల‌ను గెలుచుకోబోతోంద‌ని వెల్ల‌డించింది. తెలుగుదేశం పార్టీ కూట‌మికి కేవ‌లం 48 సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఏపీలో కొన‌సాగుతోంది.అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలయ్యాయి. పోలింగ్ గడువు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తోన్నాయి. ఎప్పటికప్పడు వాటిని విడుదల చేస్తూ వస్తున్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకుని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తోన్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను స‌ర్వే అంశాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్నే ధృవీకరించాయి. జన్‌మత్, పొలిటికల్ క్రిటిక్, లోక్‌పోల్, ఆత్మసాక్షి సంస్థలు ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌గా న్యూస్ అరెనా ఇండియా స‌ర్వే కూడా వైసీపీకి అనుకూలంగా ఫ‌లితాల‌ను ఇచ్చేసింది.

మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ వ‌ర‌కు ఈ స‌ర్వే సంస్థ అభిప్రాయ న‌మూనాల‌ను సేక‌రించింది.86,200 శాంపిల్‌ల‌ను తీసుకున్న ఎన్ఏఐ తాజాగా ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఈ స‌ర్వే ప్ర‌కారం 127 సీట్ల‌తో మ‌ళ్ళీ వైసీపీ అధికారం కైవ‌ల‌సం చేస‌కోబోతోంద‌ని తేల్చి చెప్పింది.బీజేపీ,టీడీపీ,జ‌న‌సేన పార్టీల కూట‌మి కేవ‌లం 48 సీట్ల‌ను మాత్ర‌మే గెలుచుకుంటుంద‌ని చెప్పేసింది. ఇక ఓట్ల షేరింగ్‌లోనూ వైసీపీ హ‌వా కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించింది.50.38 శాతం ఓటు షేరింగ్‌ను వైసీపీ కొల్ల‌గొడుతుంద‌ని ఎన్‌డిఏ కూట‌మి 45.58 శాతం ఓట్ల‌ను రాబ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

అలాగే కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 1.38శాతం ఓట్ల‌తో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌బోద‌ని చెప్పింది ఎన్ఏఐ. మిగ‌తా వారు 2.66 శాతం ఓట్ల షేరింగును తెచ్చుకుంటాయ‌ని పేర్కొంది. ఇక లోక్‌స‌భ సీట్ల‌లో కూడా వైసీపీ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతుంద‌ని ఎన్ఏఐ తేల్చింది. 20 ఎంపీ స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంటుంద‌ని, ఎన్‌డిఓ కూట‌మికి 5 స్థానాలు వ‌స్తాయ‌ని తేల్చేసింది.మొత్తానికి స‌ర్వేల‌లో వైసీపీకి అనుకూలంగా ఫ‌లితాలు రావ‌డంతో ఎన్‌డిఏ కూటమికి దిక్కుతోచ‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version