పార్టీకి వైసీపీ ఎమ్మెల్యే గుడ్ బై, ఎమ్మెల్యే పదవికి కూడా…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కర్నూలు జిల్లా నందికోట్కూరు నియోజకవర్గం సంచలనంగా మారింది, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్ధర్, నియోజకవర్గ యువనేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పార్టీని ఇబ్బంది పెడుతుంది. నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నా సరే తన మాట చెల్లడం లేదని, అధికారులు కనీసం ప్రోటో కాల్ కూడా పాటించడం లేదని ఎమ్మెల్యే తీవ్ర అసహనంగా ఉన్నారు.

ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని కనీసం సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రారంభించే స్థితిలో లేను అని, ఏ ప్రారంభోత్సవం చేసే అధికారం తనకు లేదని ఆయన అసహనంగా ఉన్నారు. తన బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా అని ఎమ్మెల్యే ఇప్పుడు పైకి చెప్పుకోలేని విధంగా బాధపడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఇక ఎమ్మెల్యే… తన వర్గానికి ఏ న్యాయం చేయడం లేదని, యువనేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అసహనంగా ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి అన్యాయం చెయ్యాలని ఎమ్మెల్యే చూసారని ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ కు తన మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎమ్మెల్యేపై ఆయన అసహనంగా ఉన్నారని అంటున్నారు. అక్కడి నుంచి సిద్దార్థ రెడ్డి దూకుడు పెంచారు. ఎమ్మెల్యే పెత్తనం నియోజకవర్గంలో తన మీద చెలాయించకుండా ఉండే విధంగా చూస్తున్నారు.

దీనితో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే… పార్టీ నుంచి తప్పుకోవాలని, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. వారం క్రితం ఆయన రాజీనామా చెయ్యాలని భావించినా పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే గారు వెనక్కు తగ్గారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తన వర్గానికి కనీస ప్రాధాన్యత లేదని భావించి ఎమ్మెల్యే గారు ఇప్పుడు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news