న్యాయవ్యవస్థ పై ప్రభుత్వ దాడి సరికాదు అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. రాజధాని భూముల్లో “ఇన్ సైడర్ ట్రేడింగ్” జరగలేదు అని ఆయన స్పష్టం చేసారు. న్యాయ వ్యవస్థ పై దాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పై దాడి కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారు పదవుల్లో ఉండే అర్హత కోల్పోతారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి తన పదవి కోల్పోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా తప్పుడు సలహాదారులను ముఖ్యమంత్రి తొలగించాలని డిమాండ్ చేసారు. తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెప్తే ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రిని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు….పార్టీ హితం కోరే చెప్తున్నా అన్నారు. నేను ముఖ్యమంత్రిని ప్రేమిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. సలహాదారులు ముఖ్యమంత్రికి పనికిమాలిన సలహాలు ఇవ్వడం మనేయాలని సూచించారు.