జమిలి ఎన్నికలే లక్ష్యంగా స్పీడ్ పెంచిన వైసీపీ.. క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం..

-

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది.. అన్ని పార్టీల మద్దతును కూడగడుతోంది.. దేశాభివృద్ది కోసం అన్ని రాష్టాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు బిజేపీ ప్రయత్నాలు చేస్తోంది.. దీనికి ఏన్డీఏ కూటమి పార్టీలు మద్దతిస్తున్నాయి.. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి..ఈ క్రమంలో జమిలి ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని వైసీపీ స్పీడ్ పెంచింది..

 

ఏపీలో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ టాప్ గేర్ లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమవుతోంది.. టార్గెట్ 2027 అన్నట్లుగా వేగంగా పావులు కదుపుతోంది.. మాజీ మంత్రులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి.. క్యాడర్ లో జోష్‌ పెంచుతోంది.. పాతవారికే ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తోంది.. గతంలో నియోజకవర్గం మార్చి ఎన్నిలకు పంపిన వైసీపీ..ఇప్పుడు పాత నియోజకవర్గాల బాధ్యతలనే అప్పగిస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు కూడా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారు..

2019లో ఉవ్వెత్తున ఎగిసి అధికారాన్ని చేపట్టిన వైసీపీ.. ఐదేళ్లలోనే 11 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలపైఅక్రమ కేసులు పెడుతున్నారంటూ.. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. ఇటీవల సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి.. స్టేషన్లకు తీసుకెళ్తున్న నేపథ్యంలో క్యాడర్ లో భరోసా నింపే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అధిష్టానం..

2027లో అధికారం పక్కా అంటూ నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలకు దైర్యం నింపుతోంది.. తమను ఇబ్బంది పెడుతున్న కూటమి నేతలకు రెండింటింతలు చెల్లస్తామంటూ ఆ పార్టీ నేతలు మాస్ డైలాగులు చెబుతున్నారు.. రానున్నవి మంచిరోజులుంటూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది.. జమిలి ఎన్నికలల్లో ఎవ్వరూ ఊహించిన విధంగా వైసీపీ అధికారంలోకి రాబోతుందని.. తిరుపతి జిల్లా అధ్యక్షుని ప్రమాణస్వీకారంలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ చెబుతోంది.. ప్రజలే ఈసారి తమకు పట్టం కడతారని వారు అంటున్నారు..ప్రభుత్వ వ్యతిరేకను క్యాష్ చేసుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.. క్యాడర్ కు అండగా ఉంటూ.. వారికి అవసరమైన సలహాలిస్తోంది.. టార్గెట్ 2027 అన్నట్లుగా పనిచేస్తోంది.. మొత్తంగా జమిలి ఎన్నికల కోసం వైసీపీ వెయిట్ చేస్తోందన్నమాట..

Read more RELATED
Recommended to you

Exit mobile version