వైసీపీలో అంతర్గత పోరు…ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్ములాటలు..ఈ నియోజకవర్గంలో నేతల మాటల యుద్ధం. సొంత పార్టీ వాళ్లే తనపై కుట్ర చేస్తున్నారు..ఇవి ఈ మధ్య మీడియాలో కనిపించే కథనాలు. ప్రతిరోజూ వైసీపీలో జరిగే అంతరయుద్ధం గురించి నడుస్తున్న గుసగుసలు. ప్రతిరోజూ ఎక్కడొక చోట ఎవరోకరు తమ పార్టీలో జరిగే రచ్చ గురించి మాట్లాడుతూనే ఉంటున్నారు. అలాగే ఎక్కడకక్కడ నేతల మధ్య తగాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక బాలినేని వెనుకే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకొచ్చారు. తన నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జోక్యం చేసుకుని తనని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తాను…వేరే నియోజకవర్గాల్లో వేలు పెడతానని, లేదంటే పార్టీ వీడటానికి కూడా సిద్ధమని అంటున్నారు.
అంటే వైసీపీలో విభేదాలు ఏ స్థాయిలోకి వెళ్లిపోయాయో అర్ధం చేసుకోవచ్చు. సొంత పార్టీ వాళ్ళని ఓడించడానికి…సొంత వాళ్ళే పనిచేస్తున్నారంటే…ఇంకా వైసీపీ గురించి ప్రజలు ఏం అనుకుంటారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది…ఇలాంటి సమయంలోనే అంతర్గత విభేదాలు…ఈ విభేదాలు జగన్ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది…లేదంటే సొంత వాళ్లే పార్టీని ఓడించే వరకు వదిలేలా లేరు.