కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల ముగిసిన లోక్‌సభ తర్వాత తనకు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని, కానీ తాను అందుకు అంగీకరించలేదని గడ్కరీ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో తనను ఒక కీలక పార్టీకి చెందిన నేత ఒకరు కలిశారని, ఇండియా కూటమికి మద్దతు తెలిపాలని ఆ నేత కోరినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.మీరు ప్రధాని అవుతామంటే మద్దతు ఇస్తామని కూడా ఆ నేత తనతో అన్నారని గుర్తుచేశారు.
తాజాగా మరోసారి దీనిపై గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. తనకు చాలా సార్లు ప్రధాని పదవి ఆఫర్లు వచ్చాయని, ఆ పోస్టు తీసుకుంటానంటే ఓ అపొజిషన్ పార్టీ లీడర్ సపోర్టు చేస్తానన్న వార్తలపై ఇండియా టు డే కాంక్లేవ్‌లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. నా ఐడియాలజీని వదిలేయలేను. అందుకే వాటిని అంగీకరించే ప్రశ్నే రాలేదన్నారు. ప్రధాని అవ్వడం నా లక్ష్యం కాదు. నా ఐడియాలజీపై నమ్మకంతో బతుకుతున్నా’ అని చెప్పుకొచ్చారు.