ఇటీవల అమరావతి జేఏసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చిరంజీవి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నాలు చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరపైకి తీసుకువచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని మద్దతు తెలిపిన చిరంజీవిని అమరావతి కి మద్దతు తెలపాలని జేఏసీ సభ్యులు ఆయన ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. అయితే ఇదే సందర్భంలో చిరంజీవి అభిమానులు కూడా తమ అభిమాన నటుడి ఇంటిని ముట్టడించడానికి వస్తున్న అమరావతి జేఏసీ సభ్యులను ఎదుర్కోవడానికి చిరంజీవి ఇంటి వద్ద కాపు కాయడం తో తీవ్ర ఉద్రిక్తతల వాతావరణం నడుమ అమరావతి జేఏసీ సభ్యులు చిరంజీవి ఇంటిని ముట్టడించే కార్యక్రమాన్ని విడిచిపెట్టడం జరిగింది.
ఒకవేళ బాలకృష్ణ ఈ సమయంలో అమరావతికి జై కొడితే రాజకీయంగా రాయలసీమలో బాలకృష్ణ పొలిటికల్ కెరీర్ క్లోజ్ అవుతుంది, ఇదే తరుణంలో బాలకృష్ణ మూడు రాజధానుల కి సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఈ ఎత్తుగడతో సినిమాల్లో తన ఫేవరేట్ హీరో బాలకృష్ణ ని అడ్డంగా బుక్ చేయడానికి జగన్ సరికొత్త ప్లాన్ వేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.