సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. వెంటనే నేతల వలసలతో వైసీపీ అధినేత జగన్ కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారు.. పార్టీని ప్రక్షాళన చేసి.. బలోపేతం చేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టారు.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకపోవడంతో క్యాడర్ నిరాశలో ఉంది.. దీంతో పార్టీని గాడీలో పెట్టేందుకు నేరుగా జగనే రంగంలోకి దిగారు.. ముఖ్యనేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు..
2019 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాలను సాధించిన వైసీపీ.. గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది.. దీంతో క్యాడర్ లో నూతనోత్సహం నింపేందుకు జగన్ రంగంలోకి దిగారు. సీనియర్లకు సామాజికవర్గాల వారీగా కీలక బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డారట.. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా ఉన్న జక్కంపూడి రాజాకు యువజన విభాగం రాష్ట అధ్యక్షులుగా నియమించారు.. గతంలో రాజా ఈ బాధ్యతలనే చూసుకునేవారు.. దీంతో మరోసారి ఆయన సేవలను వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు..
మాజీ మంత్రి చల్లుబోయిన వేణుగోపాల్ కు జిల్లాఅధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.. జిల్లా వ్యాప్తంగా విసృత పరిచయాలు ఉన్న నేతగా.. క్యాడర్ ను సమాయత్తం చేసే సామర్ద్యం వేణుకు ఉందని జగన్ భావిస్తున్నారట.. దీంతో ఆయనకే జిల్లా బాధ్యతలు ఇస్తారనే టాక్ నడుస్తోంది.. వేణుకు సీనియర్ల సహకరిస్తే పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. జగన్ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి..