రైతు దినోత్సవం ప్రారంభ కార్యక్రమంలో వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదే రోజు… పులివెందులలో అరటి పరిశోధన సంస్థకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ త్వరలో సంచలన ప్రకటన చేయబోతున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజునే జగన్ సంచలన ప్రకటన చేయబోతున్నారట. ఈనెల 8న వైఎస్సార్ జయంతి. ఆయన జయంతి వేడుకలు… కడప జిల్లా జమ్మలమడుగులో జరగనున్నాయి.
వైఎస్సార్ జయంతిని.. రైతు దినోత్సవంగా జరుపుకోవాలని… ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు.. ఏపీ అంతటా రైతు దినోత్సవం నిర్వహించనున్నట్టు ఏపీ వ్యవసాయం శాఖ మంత్ర కురసాల కన్నబాబు కూడా ప్రకటించారు.
రైతు దినోత్సవం ప్రారంభ కార్యక్రమంలో వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదే రోజు… పులివెందులలో అరటి పరిశోధన సంస్థకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు.
దీనితో పాటు.. ఆరోజు.. వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేయనున్నారట. అయితే.. ఆ ప్రకటన ఏంటి అనే విషయం మాత్రం బయటికి రానప్పటికీ… అది ఏపీలో సంచలనం అవుతుందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. తన తండ్రి జయంతి రోజున జగన్ ప్రకటించే పథకం ఏమై ఉంటుందబ్బా.. అని అంతా నెత్తి గోక్కుంటున్నారు.
ఇప్పటికే జగన్.. ఏపీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. ఉత్తమ సీఎంగా ప్రశంసలు అందుకుంటున్నారు. సంచలన పథకాలను ప్రకటించి.. అందరి ఆశీర్వాదాలు అందుకుంటున్నారు. మరి.. ఇప్పుడు ప్రకటించే సంచలన నిర్ణయం ఏమై ఉంటుంది. దీని వల్ల ఎవరికి లాభం.. అంటూ అప్పుడే బేరీజులు వేసుకుంటున్నారు. మరి.. ఆ ప్రకటన ఏంటో తెలియాలంటే మనం కూడా 8 వ తేదీ వరకు ఆగాల్సిందే.