రాజకీయంగా వైయస్ కుటుంబాన్ని బాగా ఆదరించింది పులివెందుల నియోజకవర్గం. జగన్ జైల్లో ఉన్న టైంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఎక్కడా కూడా జగన్ మీద కొంచెం కూడా అభిమానం తగ్గించుకోకుండా పులివెందుల నియోజకవర్గ ప్రజలు బాగా ఆదరించారు. ఇటువంటి తరుణంలో పులివెందులలో వైయస్ కుటుంబాని గత దశాబ్దాల నుండి రాజకీయాలలో ఎదుర్కొంటున్న నేత సతీష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు సతీష్ రెడ్డి చూసుకునేవారు.
దీంతో పులివెందుల రాజకీయాల్లో బాగా చంద్రబాబు జోక్యం చేసుకోవటంతో తన దగ్గరికి వచ్చిన సతీష్ రెడ్డి ద్వారా ఎవరు కూడా బీటెక్ రవి అనే టిడిపి క్యాండెట్ కి నియోజకవర్గంలో ఏ మనిషి తోడుగా ఉండకూడదని సతీష్ రెడ్డి కి జగన్ ఆదేశాలు ఇచ్చారట. దీంతో పులివెందుల నియోజకవర్గంలో అడుగుపెట్టిన బీటెక్ రవి కి పార్టీ క్యాడర్ ఎవరూ సహకరించడం లేదని చెబుతున్నారు. కనీసం ఆయన వెంట నడిచే వారే లేరని చెబుతున్నారు. క్యాడర్ అంతా సతీష్ రెడ్డి వెంటనే వెళ్లిపోవడంతో బీటెక్ రవి దాదాపు ఒంటరిగానే అయిపోయాడు. దీంతో పులివెందుల రాజకీయ జోక్యం చేసుకోవాలని ప్లాన్ వేసిన చంద్రబాబుకి జగన్ తన ఎత్తుగడలతో బెండు తీసినట్టు అయ్యింది.