బంపర్ ఛాన్స్  ని మిస్ అవుతున్న జగన్ మోహన్ రెడ్డి .. చేజేతులా … !

-

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొత్త మద్యం పాలసీ ని ప్రవేశపెట్టడం మనకందరికీ తెలిసినదే. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటి నుండి మద్యం వనరులను ఆదాయ వనరులుగా నేను చూడను అంటూ జగన్ తెలపడం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న ఆడపడుచుల కుటుంబాలు కూలిపోకుండా ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి వచ్చే ఎన్నికల ప్రచారం నాటికీ పూర్తిగా మద్యపానం నిషేధం రాష్ట్రంగా చేస్తానని జగన్ హామీ ఇవ్వటం అందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్ రావటంతో పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ఖజానా ఖాళీ అవ్వడం తో ఏపీ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో కేంద్రం మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా మద్యం బంద్‌ అయ్యింది. అయితే తాజాగా కేంద్రం అనుమతి ఇవ్వడంతో చాలా రాష్ట్రాలు ఒకపక్క లాక్ డౌన్ అమలులో ఉన్న డోర్ డెలివరీ చేస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

 

మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖజానాలో సరైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న కానీ జగన్ సర్కార్ బంపర్ ఛాన్స్ లాంటి డోర్ డెలివరీ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టకూడదు అని డిసైడ్ అయిందట. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించ బట్టే రాష్ట్ర కుటుంబ వ్యవస్థ దెబ్బతిందని తన హయాంలో ఇలా జరగకూడదని జగన్  డిసైడ్ అయ్యారట. దీంతో అద్భుతమైన అవకాశాన్ని వైయస్ జగన్ చేజేతులా మిస్ అవుతున్నారని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version