ఆది నుంచి కూడా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాలను వెల్లడిస్తున్న వి షయం తెలిసిందే. అది ఎంత వివాదాస్పదమైనా.. ఎన్ని విమర్శలు వస్తాయని అనుకున్నా.. నిర్భీతిగా వి షయాన్ని ప్రజల్లోకి తీసుకువస్తోంది. తాజాగా కూడా ఇలానే వ్యవహరించింది జగన్ ప్రభుత్వం. తాను రా ష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణకు సిద్ధమైనప్పటి విషయాన్ని దాచుకోకుండానే అసెంబ్లీలో వెల్లడించారు జగన్. ఆ వెంటనే దీనిపై కమిటీలు వేశారు. సరే! ఇప్పటి వరకు బాగానే ఉంది.ఇక, అప్పటి నుంచి విపక్షాలు పెద్ద ఎత్తున రాజధానుల పై ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
అదేసమయంలో విపక్షాలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ.. గవర్నర్ హరిచందన్ వద్దకు వెళ్లారు. ఆయ నకు మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం దూకుడు పెరిగినా.. గవర్నర్ ఈ దూకుడుకు బ్రేకులు వేస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఇప్పటి వరకు గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. కానీ, తాజాగా ఆదివారం నాటి రిపబ్లిక్ డే కార్యక్రమం సందర్భంగా మాత్రం అటు ప్రభుత్వాధినేత జగన్, ఇటు గవర్నర్ ఇ ద్దరూ కూడా రాజదాని విషయాలను కుండబద్దలు కొట్టేశారు. నిజానికి ప్రబుత్వం తరపున గవర్నర్ ప్రధాన ఉపన్యాసం చేసినప్పుడు రాజధానుల విషయం దీనిలో ఉంటే.,. దానిని ఆయన తీసివేయమని కోరవచ్చు.
ఎందుకంటే. కనీసం ఒక రోజు ముందుగానే రిపబ్లిక్ డేలో గవర్నర్ ప్రసంగం పై ప్రభుత్వం గవర్నర్ కార్యా లయానికి నోట్ పంపుతుంది. దీనిని ముందుగానే గవర్నర్ తెలుసుకుంటారు. అయితే, తాజాగా జరిగిన ఏ పీ కార్యక్రమంలో గవర్నర్ మూడు రాజధానులకే ఓటేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కేబినెట్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. రాజధాని విధులను మూడు ప్రాంతాల్లో పంపిణీ చేసే నిర్ణయం తీసుకుందని చెప్పారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్లో జ్యుడీషియల్ రాజధాని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
పాలన వికేంద్రీకరణ ద్వారా…ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇక,ప్రభుత్వం(గవర్నర్ పేరిటే జరుగుతుంది కనుక) ఎక్కడా ఏమీ దాచలేదని అంటున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితి గతంలో ఎక్కడా లేదు. ఏదైనా విమర్శలు ఎదుర్కొనే విషయం, ప్రతిపక్షాలతో ఇబ్బందులు ఎదురయ్యే విషయం ఉంటే.. ఖచ్చితంగా ఆయా అంశాలను గవర్నర్ పక్కన పెట్టి, తర్వాత అమలు చేసేవారు. కానీ, ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించడం, ప్రభుత్వ ప్రతిష్ట పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.