రోడ్డుమీదకొస్తున్న వైసీపీ క్యాడర్.. జగన్ దూకుడు అందుకేనా..?

-

మళ్లీ అధికారంలోకి వస్తామని భావించిన వైసీపీ.. ఘోరంగా ఓడిపోయింది.. దీంతో క్యాడర్ లో నైరాశ్యం నెలకొంది..ఈ క్రమంలో క్యాడర్ లో నూతనోత్సహం నింపడంతో పాటు.. పార్టీని బలోపేతం చేసే దిశగా వైసీపీ అధినేత జగన్ సిద్దమయ్యారు.. క్యాడర్ ను బిజిగా ఉంచడంతో పాటు.. యాక్టివ్ గా ఉంచేందుకు వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.. అన్నదాతల కోసం నిర్వహించిన ధర్నా కార్యక్రమాలు విజయవంతం కావడంతో..మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు..

గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలపై దృష్టిపెడుతూనే.. పార్టీబలోపేతం కోసం వైసీపీ అధినేత జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకం, ఇన్చార్జులకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోకి నేతలను పంపుతున్నారు జగన్..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ముఖ్యనేతలు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు.. ముఖ్యనేతలు ఇంత వరకూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాల్ లేవ్.. ఈ క్రమంలో నేతలను యాక్టివ్ చెయ్యడంతో పాటు.. వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను వైసీపీ అధినేత జగన్ తీసుకున్నారు.. ఎన్నికల్లో ఎక్కడ తేడా కొట్టిందా అనేదానిపై ఇప్పటికే సమీక్షలు నిర్వహించి.. ఓ క్లారిటీకి వచ్చిన జగన్.. టార్గెట్ జమిలి ఎన్నికలు అన్నట్లుగా పావులు కదుపుతున్నారు..

కేడర్‌కు, లీడర్లకు మధ్య గ్యాప్ లేకుండా ఎన్నికల కోసం సమాయత్తం చేస్తోంది. సంక్రాంతి తర్వాత వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటనకు వస్తున్నట్లు ప్రకటన చెయ్యడంతో..క్యాడర్ లో మరింత జోష్ వచ్చింది.. గ్రామ స్తాయిలో ఉండే ప్రతి కార్యకర్తను దగ్గర అయ్యేలా నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. పార్టీ క్యాడర్ ను జగన్ నేరుగా కలుస్తున్నారు.. సోషల్ మీడియా కార్యకర్తలకు దైర్యం చెబుతున్నారు.. జమిలి ఎన్నికల వైపు కేంద్రం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అందుకు తగ్గట్టుగానే తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. సిద్దంగా ఉండాలనే సందేశాన్ని క్యాడర్ కు ఇస్తోంది. మొత్తంగా జగన్ ఒక ప్లాన్ తో క్యాడర్ లో జోష్ తీసుకొస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version