మరో వివాదంలో జెసి ప్రభాకర్ రెడ్డి….ఏపీ పోలీసులకు వార్నింగ్‌ !

-

టీడీపీ పార్టీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు జెసి ప్రభాకర్ రెడ్డి. పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి…. మరో వివాదంలో చిక్కుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా… పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు జెసి ప్రభాకర్ రెడ్డి.

TDP party leader JC Prabhakar Reddy is involved in another controversy

గతంలో జిల్లా ఎస్పీ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రవాణా శాఖ అధికారులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అప్పటి రవాణా మంత్రి పేర్ని నాని పై ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా పోలీసులు పట్టించుకోకపోవడంతో… జిల్లా జడ్జికి ఫిర్యాదు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఇక ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం బాధాకరమని ఆగ్రహించారు టీడీపీ పార్టీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version