కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించారు.. ప్రపంచలో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఉన్నసోనియాను ఎదిరించారు.. జైలుకు వెళ్లినా.. ఎక్కడా మనో దైర్యం కోల్పోకుండా.. 2019లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. ఇక తిరుగులేదని భావించిన సమయంలో 2024లో ఓటమి పాలయ్యారు..
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారు.. నిత్యం ప్రజల్లో ఉండేందుకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.. నియోజకవర్గ ఇన్చార్జులతో పాటు.. ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.. పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ.. తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లేలా ఆయన రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తున్నారట..
ఒక్కో జిల్లాలో రెండు నుంచి మూడు రోజుల పాటు ఉంటూ.. కార్యకర్తలతో ఆయన మమేకం అవ్వబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఈ పర్యటనలోనే పార్టీలోని లోటుపాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ఆయన భావిస్తున్నారట.. తాను అధికారంలో కంటే.. ప్రతిపక్షంలోనే ఎక్కువ ఏళ్లు గడిపానని.. తనకేం ప్రతిపక్షం కొత్తకాదని చెబుతూనే.. భవిష్యత్ మనదే అన్న భరోసాను ఆయన నేతలకు కల్పిస్తున్నారు..
సంక్రాంతి దాకా క్యాడర్ ను బిజిగా ఉంచేలా జగన్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారట.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్న వర్గాలను ఎంచుకుని.. వారిని కలుపుకుని పోరాటాలు చెయ్యాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారట.. ఇందులో భాగంగా ఈనెల 13న రైతు సమస్యలపై ఆందోళన చెయ్యబోతున్నారట.. దాంతోపాటు.. విద్యార్దుల పీజురియంబర్స్మెంట్, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా వ్యూహరచన చేస్తున్నారు.. ఇవి పూర్తయిన వెంటనే సంక్రాంతి తర్వాత జగన్ జనంలోకి రాబోతున్నారు.. మొత్తంగా మరో కొద్దిరోజుల్లో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారబోతోంది.