అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు – మంత్రి పొన్నం ప్రభాకర్

-

తెలంగాణ తల్లి పై నేడు శాసనసభలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తెలంగాణ తల్లికి అధికారిక రూపం లేదని అన్నారు మంత్రి పొన్నం. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలు అన్ని ఒక పార్టీకే అనుసంధానమైనవేనని అన్నారు.

పదేళ్ల నుండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించలేదని.. తమ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి.. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి పరిమితం కాదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి. తెలంగాణ చిహ్నంలో మార్పు జరగలేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ గీతాన్ని రూపొందించి అధికారికంగా ఉపయోగిస్తున్నామన్నారు.

తెలంగాణ సెంటిమెంట్ కి అనుగుణంగా తమ ప్రభుత్వం రాగానే రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఏర్పాటు చేశామని వివరించారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం. భవిష్యత్తులో ప్రతి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లలో, పోలీస్ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version