ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వైసీపీలో చేరతారా ఏ ఎమ్మెల్యే టీడీపీకి షాక్ ఇస్తారో కూడా తెలియడం లేదు. చంద్రబాబు సన్నిహితులు కూడా ఆయనకు షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా చంద్రబాబు సన్నిహితుడు ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సీనియర్ నేత ఎమ్మెల్యే కరణం బలరాం వైసిపి లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన గురువారం శుక్రవారం జగన్ ని కలిసి అవకాశాలు కనబడుతున్నాయి.
ఆయనతో పాటుగా ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న మరి కొందరు ఇప్పుడు వైసిపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత సిద్ధ రాఘవరావు కూడా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమరనాథ రెడ్డి , నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన ఒక కీలక నేత కూడా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అమర్నాథ్ రెడ్డి మరదలు పుంగనూరు నుంచి పోటీ చేసిన అనీషారెడ్డి కూడా ఇప్పుడు వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక కర్నూలు జిల్లాలో కూడా మరికొందరు నేతలు ఇప్పుడు వైసిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనితో అసలు వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఉంటుందా, అసలు పోటీ చేసే అభ్యర్థులను దొరుకుతారా అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినపడుతోంది. దీనితో ఇప్పుడు చంద్రబాబు ముందు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.