కృష్ణా సీట్లలో ట్విస్ట్..వైసీపీలో సిట్టింగులకు షాక్.?

-

నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వడానికి సి‌ఎం జగన్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న అందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే..వైసీపీకి భారీ నష్టం తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అంతర్గత సర్వేల్లో కూడా అదే స్పష్టమైంది. వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు. అందుకే ప్రజా వ్యతిరేకత ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వడానికి జగన్ సిద్ధంగా లేరు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలని ఒక సీటు నుంచి మరొక సీటుకు మార్చడానికి చూస్తున్నారు.

ఈ క్రమంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. పైగా జిల్లాలో ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీని వదిలి టి‌డి‌పిలోకి రావడానికి చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో జిల్లా వైసీపీ సీట్లలో మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి కొన్ని సీట్లలో క్లారిటీ ఉంది గాని..కొన్ని సీట్లలో క్లారిటీ రావడం లేదు. ఎలాగో గుడివాడ, గన్నవరం, పామర్రు, విజయవాడ సెంట్రల్, వెస్ట్, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలే దాదాపు పోటీ  చేయడం ఖాయం.

ఇక మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తన వారసుడు కృష్ణమూర్తిని బరిలో దించనున్నారు. ఇటు పెడనలో మంత్రి జోగి రమేశ్ పోటీ డౌటే..ఆయన మైలవరం వెళ్తారని అంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. దీంతో ఈ రెండు సీట్లపై క్లారిటీ లేదు. అటు అవనిగడ్డ, కైకలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు లేదనే ప్రచారం వస్తుంది.

నూజివీడులో సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ ఉన్నారు..కానీ ఈ సీటులో పోటీకి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ రెడీ అవుతున్నారట. పెనమలూరులో పార్థసారథి మళ్ళీ పోటీ చేసే విషయంపై క్లారిటీ లేదు. విజయవాడ ఈస్ట్ లో దేవినేని అవినాష్ పోటీ చేయనున్నారు. మొత్తానికి కృష్ణా వైసీపీ సీట్లలో ట్విస్ట్‌లు వచ్చేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version