వైసీపీలో ‘యువ’ పోరు..డ్యామేజ్ అవుతుందా?

-

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటినుంచో పలు స్థానాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయంలో నిజముంది. ఆ ఆధిపత్య పోరు ఇప్పటికే పలు స్థానాల్లో బయటపడగా, కొన్ని చోట్ల పార్టీ పరిస్తితులని చక్కదిద్దడానికి వైసీపీ పెద్దలు ప్రయత్నించారు. కొన్ని చోట్ల కాస్త పోరు సద్దుమణిగింది. కానీ కొన్ని చోట్ల ఇంకా తీవ్ర స్థాయిలో నడుస్తోంది.

అయితే ఈ ఆధిపత్య పోరులో యువనేతలు కూడా కనిపిస్తున్నారు. కొన్ని స్థానాల్లో యువ నేతలు ఆధిపత్య పోరులో ఉంటున్నారు. ఇదే క్రమంలో రాజమండ్రి పరిధిలో ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య ఎప్పటినుంచో పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో వీరు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టుకుని విమర్శలు చేసుకున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఇద్దరు నేతలని పిలిచి క్లాస్ పీకింది. ఆ తర్వాత వీరు కాస్త సర్దుకున్నారు.

 

అలా అని వీరి మధ్య పోరు మాత్రం సర్దుకోలేదని తెలిసింది. ఇప్పుడు రాజమండ్రి సిటీ సీటు విషయంలో వీరి మధ్య రచ్చ జరుగుతుంది. ఈ సీటు కోసం భరత్ ట్రై చేస్తున్నారు. కానీ ఈ సీటు కాపు వర్గానికి ఇవ్వాలని రాజా వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇలా వారి మధ్య రచ్చ జరుగుతుంది. ఇటు నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు సొంత పార్టీ నేతలతో ఇబ్బంది ఉంది. ఈయన్ని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసి దెబ్బకొట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆ విషయం స్వయంగగా అనిల్ చెబుతున్నారు.

ఇక నందికొట్కూరులో యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి, ఎమ్మెల్యే ఆర్థర్‌కు పడటం లేదు. ఇలా చాలా కీలక నియోజకవర్గాల్లో యువనేతలు సైతం ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. దీని వల్ల పరోక్షంగా వైసీపీకి నష్టం జరిగేలా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version