రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు మెల్లి మెల్లిగా మెరుగుపడుతున్నాయి. ప్రజలు ఢిల్లీ లో పొల్యూషన్‌తో గత కొన్నేళ్లుగా హడలెత్తిపోతున్నారు. ఢిల్లీ అంటేనే ఊపిరిపీల్చుకునే పరిస్థితులు ఉండక,ప్రజలు నానా ఇబ్బందులు పడే వారు.అలాంటి ఢిల్లీలో ఈనెలలో మాత్రం సరికొత్త రికార్డ్ నమోదు అయింది. గత తొమ్మిదేళ్లలో లేని గాలి నాణ్యత.. ఈనెలలోనే నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది.
ఫిబ్రవరిలో గాలి నాణ్యత సూచిక 200 కంటే తక్కువగా నమోదైనట్లుగా వెల్లడించారు. గతంలో అయితే AQI 400 నమోదు అయిందని తెలిపారు. 9 సంవత్సరాలలో ఇదే అత్యుత్తమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెప్పుకొచ్చింది. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 2013 తర్వాత ఇదే అత్యధికమని వెల్లడించింది.పొల్యూషన్ కారణంగా అనేక రోజులు స్కూళ్లకు సెలవులు, వాహనాలకు సరి-బేసి విధానాన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక 9 ఏళ్ల తర్వాత వాతావరణం కుదిటపడడంతో ఢిల్లీ వాసులకు ఇది శుభపరిణామమే అని అనుకోవాలి మరి.