కేటిఆర్ మేడిగడ్డ సందర్శన అనేది ఓ రాజకీయ డ్రామా అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసిఆర్ మేడిగడ్డను ఎన్నోసార్లు చూశారని గుర్తుచేశారు. కానీ, కేటీఆర్ మేడిగడ్డ కుంగలేదని చెప్పారన్నారు. మేడిగడ్డ సందర్శనతో బీఆర్ఎస్ సమస్యల్లో ఇరుక్కోవడమే తప్ప నయా పైసా లాభం ఉండదని ఆయన అన్నారు.
కాగా, రేపు మేడిగడ్డకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ తర్వాత అన్నారంలో పర్యటిస్తామని , అనంతరం అన్నారం దగ్గర ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పారు. ప్రజెంటేషన్ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తామని వెల్లడించారు. నీటిపారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్తామన్న కేటీఆర్ మొత్తం 200 మంది ప్రతినిధులతో వెళ్తున్నట్లు వివరించారు.