ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లు మంగళవారం విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారిక వెబ్సైట్ polycetap.nic.inలో హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఏపీ పాలీసెట్ 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభమయ్యి, మే 18 వరకు కొనసాగింది. ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 29న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో జరగనుంది.2022 – 23 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్/నాన్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో, అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పించడానికి పాలీసెట్ పరీక్ష నిర్వహించబడుతోంది.
AP Polycet 2022 హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేయాలంటే..
ముందుగా అధికారిక వెబ్సైట్ polycetap.nic.inను ఓపెన్ చెయ్యాలి. హెూమ్ పేజీలో కనిపించే ‘Print Hall Ticket లింక్పై క్లిక్ చెయ్యాలి. 10వ తరగతి హాల్ టిక్కెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరాన్ని లేదా పరీక్షలు రాసిన సంవత్సరాన్ని నమోదు చేసి, క్యాప్చా సబ్మిట్ పై క్లిక్ చెయ్యాలి. View and print hall ticket’ పై క్లిక్ చెయ్యాలి. వెంటనే ఏపీ పాలీసెట్ హాల్ టిక్కెట్ స్క్రీన్పై కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి.