వర్సిటీలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారా : వైఎస్‌ షర్మిల

-

మరోసారి సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాల యాలపై పెద్దదొర పగబట్టారని, సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. యూనివర్సిటీలకొస్తే విద్యార్థులు ఎక్కడ తిరగబడతారోనని దొరకు, దొర దందా టీమికి భయం పట్టుకుందని సోమ వారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘మిమ్మల్నిఅడుగు పెట్టనివ్వ లేదని వర్సిటీలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారా’ అని ఆమె ప్రశ్నించారు.

‘చదువు కుంటే ప్రశ్నిస్తారు, కొలువులు అడుగుతరనే ఖాళీగా ఉన్న 1869 ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయడం లేదా’ అని షర్మిల నిలదీశారు. విద్యార్థుల చదువును ఆగం చేసేందుకే అధ్యా పకుల పోస్టులను భర్తీ చేస్తలేరని విమర్శిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాల యాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేవరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొట్లాడుతుందని ఆమె స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో మెరుగైన విద్య అందేవరకూ విద్యార్థుల పక్షాన పోరాడుతామని షర్మిల హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version