తెలంగాణ మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు నేడు వెలువడిన జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురైయ్యారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మహాకూటమిలో పొత్తుల వల్లే సీట్ల పంపకాలు ఆలస్యం అవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పొత్తులు తేలినా..తేలకపోయినా తాను జనగామ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ జనసమితి జనగామ సీటు ఎందుకు కావాలంటుందో తమకు అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో 119 స్థానాలు ఉంటే… కోదండరాంకు పోటీ చేయడానికి ఇదే స్థానం దిరికిందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ అధిష్టానం తనకు అన్యాయం చేయదని …తనను కాదని జనగామలో ఎవరికి సీటు ఇస్తారంటూ పేర్కొన్నారు.