బంజారా నృత్యం చేసిన పొన్నం.. ఫొటోస్ వైరల్..!

-

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం లోని భీమదేవరపల్లి మండలం లో రోడ్ షోని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం బంజారా మహిళల తో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సన్నివేశాన్ని తిలకించిన ప్రజలు ఉత్సాహం చూపించారు.

ఈ ప్రచారం లో పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ బంజారా నృత్యం కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గం లోని అక్కన్న పేట మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, బంజారా మహిళలతో కలిసి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారితో పాటు బంజారా నృత్యం చేయడం సంతోషంగా ఉందని పోస్ట్ చేసారు పొన్నం.

Read more RELATED
Recommended to you

Latest news