వార్తపత్రికల్లో వధువు కావలెను, వరుడు కావలెను అని ప్రకటనలు మనం చూస్తూనే ఉంటాం. కానీ 70 ఏళ్ల తాత గర్ల్‌ఫ్రెండ్ కావాలని ప్రకటనలు ఇస్తున్నాడు. అంతే కాదు.. వారానికి 33వేలకు పైగా ఈ ప్రకటనలకు ఖర్చుపెడుతున్నాడట.. ఆశ్చర్యంగా ఉంది కదూ..! గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ ఈ ప్రకటన వెలువడిన రెండు వారాల్లోనే 400 కాల్‌లు, 50 ఇమెయిల్‌లు వచ్చాయట. తాతయ్య వీటన్నింటిని తిరస్కరించి తన కాబోయే భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ తాత అమెరికా నివాసి. తనకు కాబోయే భార్య పెళ్లయ్యాక అమెరికాలోని ఏ మూలకు వెళ్లాలనుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఈ తాత బాదేంటో తెలుసుకుందాం రండీ..!
70 ఏళ్ల తాత పేరు గిల్బర్టీ. ఇప్పటి సోషల్ నెట్ వర్కింగ్ ట్రెండ్‌కు ఈ తాత పడలేదు. సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రయత్నం చేయలేదు. దాని స్థానంలో 20 అడుగుల ఎత్తైన బిల్‌బోర్డ్ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన టెక్సాస్‌లోని స్వీట్‌వాటర్ సమీపంలో పోస్ట్ చేశారు. ఒంటరి మనిషి, ఎక్కడికైనా కదలగల మనసు, నడవడానికి భాగస్వామి కావాలి, పెళ్లి చేసుకోవడానికి ప్రేమగల మనసున్న వధువు కావాలి, కరోకే పాడాలి అంటూ బోల్డ్ లెటర్స్ లో అడ్వర్టైజ్ మెంట్ ప్రింట్ చేశారు.
ఈ ప్రకటన ధర $400 డాలర్లు, వారానికి భారతీయ రూపాయలలో 33,000 రూపాయలు. ప్రకటన వచ్చిన 2 వారాల్లో 400 కాల్‌లు వచ్చాయి. 50కి పైగా ఇమెయిల్‌లు వచ్చాయి. దీనిపై స్పందించిన గిల్బర్టీ.. ఇప్పటి వరకు వచ్చిన కాల్స్, ఈమెయిల్స్ నిజమైన ప్రేమను చూపించవని తెలిపాడు. డబ్బు, ఆస్తి కోసం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ నా డ్రీమ్ పార్టనర్ నా చేయి పట్టుకుంటారనే నమ్మకంతో ఉన్నాను’ అని గిల్బర్టీ అన్నారు.
నా చేయి పట్టుకున్న పెళ్లికూతురు ధనవంతురాలు కానవసరం లేదు. అందంగా ఉండాల్సిన పనిలేదు. కానీ నిజాయితీ, విధేయత, స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నేను అమెరికాలోని ఏ ప్రాంతానికైనా మకాం మార్చడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడా తాత.. నిజమైన పార్టనర్ జీవితానికి ఎంత ముఖ్యమో ఆయన 70 ఏళ్లు వచ్చాక తెలుసుకున్నాడు. ఈ విషయం మొదట విన్నప్పుడు చాలా మందికి ఫన్నీగా అనిపించి ఉండొచ్చు కానీ.. ఆ తాత కోణంలో ఆలోచిస్తే.. ఒక తోడు కోరుకోవడం కోసం ఆయన ఎంత తపిస్తున్నాడో తెలుస్తుంది. ! నిజానికి అందరూ 25- 30 ఏళ్లలో పెళ్లి చేసుకుంటారు తోడు కోసం.. ఆ టైమ్‌లో ఎవరు లేకున్నా మనిషి బతకగలడు.. కానీ 50 దాటాక ఒంటరిగా ఉండటం అస్సలు సాధ్యం కాదు. అప్పుడే అనిపిస్తుంది ఈ బాధ్యతలు ఏవీ లేకుండా నేను నా భార్య సంతోషంగా ఉండాలి అలాంటి చోటుకు వెళ్లాలి అని..!