విద్యార్థుల కోసం పొన్నం ప్లాన్..!

-

చేనేతరంగాన్ని ప్రోత్సహించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగాన్ని కాపాడండి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చేనేతరంగాన్ని కాపాడ్డానికి మీరు ఎప్పుడైనా అతిధులకు పెద్దలకి మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ తో సన్మానం చేయొచ్చు అని అన్నారు. అటు చేనేత రంగాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని కాటన్ టవల్స్ ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

లేదు అంటే పిల్లలకి ఉపయోగపడే పుస్తకాలు పెన్నులు ఇవ్వాలని ఆయన సూచించారు మీరు తెచ్చే శాలువాలు కప్పుకోకుండా మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు అవుతుందని కప్పుకుంటే ఇది ఎందుకు పనికిరాదు ఎవరికీ ఉపయోగపడదని అన్నారు. ప్లాస్టిక్ తో ఇవి సమానమని చెప్పారు టవల్స్ కానీ పిల్లలకి ఉపయోగపడే పుస్తకాలు పెన్నులు వంటివి మంత్రులు, పెద్దలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇవ్వాలని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news