పవన్ కు జోడీగా బట్టబొమ్మ ఫిక్స్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ భీమ్లా నాయక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాల్లోనూ పవన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ లో ఉండగా ఆ తర్వాత పవన్ హరీష్ శంకర్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. “భవదీయుడు భగత్ సింగ్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారని ముందు నుండి చర్చ జరుగుతోంది. కాగా తాజాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నట్టు హరీష్ శంకర్ ప్రకటించారు. ఇప్పటికే పూజా హెగ్డే మెగా హీరోల సరసన నటించి ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. పవన్ హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.