మీరు లోన్ తీసుకున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం తో రుణ గ్రహీతలకు ఊరట కలగనుంది అని తెలుస్తోంది. కనుక రుణ గ్రహీతలు రిలీఫ్ గా ఉండచ్చు. ఇక అసలు విషయం లోకి వెళ్ళిపోతే.. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏమిటంటే వడ్డీ రేట్లను ఏమి మార్చకుండా యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
వడ్డీ రేట్లను మార్చకుండా అలానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది ఆర్బీఐ. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. అయితే తాజా ద్రవ్యపరపతి సమీక్షలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ నిర్ణయం వల్ల కీలక రెపో రేటు స్థిరంగానే వుంది. రెపో రేటు 4 శాతం వద్దనే కొనసాగుతుండగా… రివర్స్ రెపో రేటు 3.5 శాతం ఉంది.
వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నారు. అలానే జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని ఈ ఏడాది 9.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం సీపీఐ 5.3 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అదే విధంగా గత పాలసీ సమీక్షతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కుదుటపడ్డాయని అన్నారు.