రంగుల్లో కలలు
రంగుల కలలు
అన్నీ అన్నీ నిజం అయితే
క్షణాలు అద్భుతం అయి ఉంటాయి
అవి పూజా హెగ్డేవి అయి ఉంటాయి
అందం రేఖా గణితం.. వర్ణన అన్నది బిందువు నుంచి మొదలయి ఎక్కడో ఆకాశంలో చందమామ దగ్గర ఆగిపోతుంది. కనుక ఆ చుక్కను ఈ చుక్కను కలిపి ఉంచేంత శక్తి కవిత్వానికి ఉంది. అదే రీతిలో పూజాహెగ్డే అనే సోయగానికీ ఉంది. అందుకనో, ఎందుకనో ఏ రంగంలో అయినా కష్టం ఒక్కటే మన కలల తీరానికి చేరుస్తుంది అన్నది పూజా హెగ్గే భావన. స్థిరం అయిన అభిప్రాయం కూడా! అందుకే తన కష్టం ఫలించి తాను అనుకున్న రీతిలో సొంతింటి కలను నిజం చేసుకున్న సందర్భాన తల్లిదండ్రుల ఆనందాలనూ, తన సంతోషాలనూ కలిపి అభిమానులతో పంచుకుంటోంది.
అనగనగా అరవిందను నేను అని పాడుకోవడంలో కుర్రకారు ఇంకా బిజీబిజీగానే ఉన్నారు.ఆమె కోసం వినిపించిన బుట్ట బొమ్మ పాటంతా ఓ ప్రత్యేక రీతితోనే సాగిపోయిన తరుణాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. అటుపై ఆమె రూపూ,రేఖా అన్నవి కుర్రాళ్ల కలల ప్రపంచంలో నిండిపోయిన తీరుకు మాటలు ఎన్ని చెప్పినా అవన్నీ తక్కువే.
కేవలం కొద్దిపాటి సినిమాల తోనే అంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ పొడుగు కాళ్ల సోయగం ఓ అద్భుతం అయిన అనుభూతిని పొందానని చెబుతోంది. సొంతింటి కలను నెరవేర్చుకున్నాక తన అనుభూతి వర్ణనాతీతం అని చెబుతూ పొంగిపోతోంది. కనుక ఇప్పుడు బుట్ట బొమ్మ మామూలుగా కాదు కళ్లింతలు చేసుకుని మరీ! తన ఇంటిని అతిథులకు చూపిస్తూ సంబరపడిపోతోంది.
అందమయిన కలలకు కేరాఫ్ గా ఉండడంలోనే ఆనందం ఉంది. అందమయిన కలలకు రూపం ఇవ్వడంలో ఆనందంతో పాటు బా ధ్యత కూడా ఉంది.తన ఇంటి కలను నిరూపణకు నోచుకునేందుకు పూజా హెగ్డే ఎంతో శ్రమించింది.సినిమాలు చేస్తూనే తన కలల కుటీరానికి రంగులను అద్దింది.వాస్తుకు అనుగుణంగా ఇంటిని తీర్చిదిద్ది,తనకు మనోల్లాసం ఇచ్చేవాటిని తన ఇంటి గూటికి చేర్చిం ది.
సొంతిల్లు అనే ఓ పెద్ద కల అందాల చిన్నది పూజా బేబీ సొంతం చేసుకోవడంతో అసలు కథ మొదలయింది.అంటే తన టేస్టుకు అ నుగుణంగా ఇంటిని నిర్మించుకోవాలన్న కల ఒకటి తనలో ఎప్పటి నుంచో ఉంది అన్నది ఆమె మాట. ఆ విధంగా పూజా హెగ్డే సొం తింటికి చేరుకుంది. పూజలు చేసి, సంప్రదాయ రీతిలో గృహ ప్రవేశం చేసింది. ఇక ఆమె ఆనందానికి అవధులే లేవు.
– చిత్ర కథంబం మన లోకం ప్రత్యేకం