ఎంత త‌ప్పు చేశావు కోహ్లీ! ఇదే నా దేశానికి ఇచ్చే గౌర‌వం?

-

టీమిండియా, సౌత్ ఆఫ్రికా మ‌ధ్య నేడు మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు.. జాతీయ గీతం పాడే స‌మ‌యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వింత ప్ర‌వ‌ర్త‌న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోలో.. మ్యాచ్ కు ముందు జాతీయ గీతం పాడుతున్న స‌మ‌యంలో విరాట్ కోహ్లి అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. అంద‌రూ సీరియ‌స్ గా జాతీయ గీతాన్ని పాడుతున్న స‌మ‌యంలో విరాట్ కోహ్లి మాత్రం చూయింగ్ గ‌మ్ న‌ములుతూ క‌నిపించాడు.

దీంతో టీమిండియా అభిమానులు విరాట్ కోహ్లి పై ఫైర్ అవుతున్నారు. కోహ్లికి జాతీయ గీతం పాడేంత ఇంట్రెస్టు కూడా లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. కాగ‌ ఎప్పుడూ ఫీల్డ్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లి.. ఇప్పుడు ఎందుకు ఇలా ఇంట్రెస్టు లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని మ‌రి కొంత మంది సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కాగ ఇటీవ‌ల విరాట్ కోహ్లి, బీసీసీఐ మ‌ధ్య వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. కెప్టెన్సీ విష‌యంలో వివాదం తారా స్థాయికి చేరుకుంది. అప్ప‌టి నుంచి విరాట్ కోహ్లి ప్ర‌వ‌ర్త‌న చాలా మార్పు క‌నిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version