పూజా హెగ్డే రేటు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

-

ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముకుంద చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజ.. ఆపై బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజదారో చిత్రం చేసింది. అయితే అది ఘోర పరాజయం కావడం, ఇక్కడ డీజేలో అవకాశం రావడం అది సూపర్ హిట్ అవ్వడంతో పూజకు కలిసి వచ్చింది. ఆ చిత్రం నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే పూజకు రాలేదు.

వరుస ఆఫర్ల రావడం, చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయింది. మహర్షి, గద్దలకొండ గణేష్, అరవింద సమేత, అల వైకుంఠపురములో ఇలా అన్నీ సూపర్ హిట్సే. ఇలా టాలీవుడ్‌లో లక్కీ గాళ్‌గా మారిన పూజా.. బాలీవుడ్‌లో హౌస్‌ఫుల్ 4తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడున్న క్రేజ్, అక్కడి విజయంతో తోడవడంతో పూజా బాగానే రేటు పెంచినట్టు తెలుస్తోంది.

తెలుగులో కోటి వరకు డిమాండ్ చేసే ఈ భామ.. ప్రస్తుతం సల్మాన్ చిత్రానికి ఎంత పుచ్చుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ‘కభీ ఈద్ కభీ దివాలి’ పేరిట రూపొందే ఈ చిత్రంలో నటించడానికి గాను 4 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా అక్కడ విజయం సాధిస్తే.. మరింత పెంచే అవకాశముందని టాక్. పూజా ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సరసన నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version