ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికలను ఉన్నపళంగా వాయిదా వేయడం, ఆ తర్వాత సిఎం జగన్ మీడియా సమావేశం పెట్టి ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ మీద విమర్శలు చేయడం, ఆ తర్వాత వైసీపీ నేతలు,ఏకంగా శాసన సభ స్పీకర్ విమర్శలు చేయడం కాస్త సంచలనంగా మారాయి. సిఎస్ నీలం సహాని కూడా ఆయనకు లేఖ రాసారు.
ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక పరిణామం చోటు చేసుకుంది, రాష్ట్రంలో నేను ఎన్నికలను నిర్వహించాలి అంటే, కచ్చితంగా కేంద్ర బలగాలు కావాలని ఆయన కోరారు. అలాగే తనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఏకగ్రీవం అయిన వాటిని కూడా ప్రస్తావించారు. దీనితో ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఆయన లేఖ రాస్తే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని కాని అలా నేరుగా పంపరని అంటున్నారు. మీడియా కూడా తమకు ఆ లేఖ ఏ విధంగా అందిందో చెప్పడం లేదు. మీడియా పెద్దలు కూడా ఈ విషయంలో ఏ స్పష్టత కు రాలేకపోతున్నారు. తాను లేఖ రాయలేదని రమేష్ కుమార్ మీడియా కు వెల్లడించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని పేరు ఉన్న లెటర్ ప్యాడ్ మీద ఆయన సంతకంతో కూడిన ఈ లేఖ బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది.