ఆచార్య నుండి నీలాంబరి వచ్చింది..ఎర్రరైక పచ్చచీర తో అదిరిపోయే లుక్…!

టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే పూజా హీరోయిన్ గా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ పూజా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా పూజా హెగ్డే నటిస్తున్న ఆచార్య సినిమా నుండి పూజా పోస్టర్ ను విడుదల చేశారు. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే మెగాస్టార్ కు హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ కు జోడీగా సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. కాగా తాజాగా సినిమా నుండి పోస్టర్ విడుదల చేసి ఆచార్య యూనిట్ పూజాను సర్ప్రైజ్ చేసింది. ఈ ఫోటోలో పూజా ఎర్ర రైక పచ్చ చీర తో అదరగొడుతోంది. మరోవైపు పూజ హెగ్డే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పూజా నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా మరిన్ని క్రేజీ సినిమాల్లో నటిస్తోంది.