అరుణాచల్ పై చైనాకు ఇండియా ఘాటు జవాబు

-

సరిహద్దుల్లో గిచ్చి కయ్యాలు పెట్టుకుంటున్న చైనాకు మరోమారు గట్టిగా తన వైఖరిని స్పష్టం చేసింది ఇండియా. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్గత భాగం అని చైనాకు తేల్చి చెప్పింది. ఇటీవల ఉపరాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను తప్పుపడుతూ చైనా విదేశాంగ శాఖ అభ్యంతరం తెలిపింది. చైనా అభ్యంతరంపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్గత భాగం అంటూనే అక్కడికి వెళ్లే హక్కు భారతీయులకు ఉందని స్పష్టం చేసింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కడ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివ్రుద్ధిపై మాట్లాడారు. అయితే ఇది నచ్చని చైనా, అరుణా చల్ ప్రదేశ్ ను తాము గుర్తించలేదని, అక్కడ ఇండియన్ లీడర్ల పర్యటనను వ్యతిరేఖిస్తున్నామని ఆదేశ విదేశాంగ శాఖ అభ్యంతరం తెలిపింది. గతంలో కూడా భారతనాయకులు అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించిన తర్వాత చైనా ఇదే మాదిరిగా అవాకులుచెవాకులు పేలింది. తాజాగా భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులు ఇచ్చింది. చైనా మొదటినుంచి అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పిలుస్తూ అక్కడ ఉద్రిక్తతలను రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news