ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది. తన అందచందాలతో పాటు నటనతో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా పూజాహెగ్డే ఆస్తి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారుతున్నాయి. వాటి గురించి చూద్దాం.
పూజా హెగ్డే మొదటిసారిగా నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది ఆ తరువాత వరుస సినిమాలతో అగ్ర హీరోలతో నటించి మంచి అవకాశాలను సంపాదించుకుంది. పూజా హెగ్డే గత రెండు సంవత్సరాల నుండి ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈమె పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
పూజా హెగ్డే మిస్ ఇండియా లో 2009 లో పాల్గొని మొదటి రౌండ్లోనే ఎలిమినేట్ అయింది. పూజా హెగ్డే తన మొదటి సినిమా “మాస్క్ “కోసం 30 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంది. పూజా హెగ్డే తన బాడీ ఫిట్నెస్ కోసం ప్రతిరోజు రెండు గంటల పాటు యోగా వర్కౌట్లు చేస్తుంది. పూజా హెగ్డే ఖాళీగా ఉన్న సమయాలలో ఎక్కువగా పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ చేయడం, డాన్స్ వేయడం అంటే ఎక్కువగా ఇష్టమట.
ఇక పూజా హెగ్డే ఆస్తి విషయంలోకి వస్తే పూజా హెగ్డే తల్లి తండ్రి కూడా ఒక వ్యాపార వేత్త. ఈమె తల్లి లత కూడా ఒక నెట్ వర్క్ మార్కెట్ బిజినెస్ నడుపుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటోంది. అంతేకాకుండా ముంబయిలో కూడా ఒక ఇల్లు ఉంది.. ఈ ఇంటి విలువ దాదాపుగా రూ.10 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈమె దగ్గర ఉండే నాలుగు ఖరీదైన కార్లు ఉన్నవి వీటి విలువ రూ.10 కోట్లు పైనే ఉంటుంది. ప్రస్తుతం పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నది వీటి ద్వారా సంవత్సరానికి రూ. 20 కోట్ల రూపాయల ఆదాయం. ప్రస్తుతం ఈమె మొత్తం ఆస్తి విలువ రూ.180 కోట్లపైగానే ఉన్నట్లు సమాచారం.