టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా ఎక్కువగా కనపడుతుంది. ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. ఇక అగ్ర హీరోలు అందరూ కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అగ్ర దర్శకులు ఇప్పుడు ఆయనతో సినిమా చెయ్యాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే పూజ హెగ్డే పొగరుకి కారణమని అంటున్నారు. ఆమె కొన్ని కొన్ని విషయాల్లో చాలా అతి చేస్తుందని అంటున్నారు.
ఇటీవల ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనితో ఆమె బాలీవుడ్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఈ సినిమాలు చేయడానికి ఆమె ముందు తెలుగులో అంగీకరించిన సినిమాలను కూడా పక్కన పెడుతుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది నిర్మాతల దగ్గర ఆమె అడ్వాన్స్ తీసుకుని కూడా డేట్స్ ఇవ్వడం లేదని బాలీవుడ్ సినిమాల కోసం ఇక్కడి సినిమాలను తక్కువగా చూస్తుంది అంటున్నారు.
డేట్స్ పది రోజులు 12 రోజులు ఇస్తూ చికాకు పెడుతుంది ఆమె. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఆమెకు భారీగా పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. దాదాపు మూడు కోట్ల వరకు ఆమె తీసుకుంటుంది అనే టాక్ వినపడుతుంది. దర్శకులు ఎక్కువగా ఆమె కోసం పాత్రలు రాస్తున్నారని త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే పూజ ను లక్కీ హీరోయిన్ గా చూస్తున్నాడు అంటున్నారు.