త్వరలో పెళ్ళి పీటలకెక్కబోతున్న కీర్తి సురేష్ ..వరుడెవరో తెలుసా ..?

-

మహానటి సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది కీర్తి సురేష్. అలనాటి ప్రముఖ నటి మేనక ముద్దుల కూతురైన కీర్తి సురేష్ ముందు కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా బాగా ఫేమస్ అయింది. హీరోయిన్ గా కీర్తి సురేష్ మొదటి సినిమా మలయాళం లో నటించిన గీతాంజలి. ఆ తర్వాత తమిళ, తెలుగు సినిమా ల్లో హీరోయిన్ గా పరిచయమైంది. కీర్తి సురేష్ తండ్రి నిర్మాత సురేష్ కుమార్, తల్లి నటి మేనక కావడంతో కీర్తి కూడా సినీ రంగం వైపు వచ్చింది.

 

2000 సంవత్సరం లో బాలనటిగా నటించింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. తల్లి మేనక అటు తమిళం ఇటు మళయాళ సినీ రంగాలలో నటిగా ఫేమస్ కాబట్టి కీర్తి సురేష్ కూడా తమిళం, మళయాళ సినిమాలలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక కీర్తీ అక్క రేవతీ కూడా చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్ అయిన కీర్తి సురేష్ అక్క బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ లో పనిచేశారు. తమిళంలో కీర్తి సురేష్.. శివ కార్తికేయన్, విజయ్, ధనుష్, విక్రం వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది.

ఇక తెలుగులో రాం హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని తో నేను లోకల్ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించిపెట్టాయి. అయితే కీర్తి సురేష్ కూడా ఊహించని సినిమా మాత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెకకెక్కిన అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో సావిత్రి గా నటించి సౌత్ లో మంచి పేరు ని సంపాదించుకుంది.
అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అవడంతో మళ్ళీ తెలుగులో కనిపించలేదు.

ఇక ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సినిమా ఒకటి, టాలీవుడ్ లో సూపర్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాలో నటిస్తుందని తాజా సమాచారం. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ కి సంబంధిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో కీర్తి సురేష్ పెళ్ళి పీటలెక్కబోతోందని లేటెస్ట్ న్యూస్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ స్నేహితుడి కొడుకుతో కీర్తి పెళ్ళి ఫిక్సైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ కమిటయిన సినిమాలు పూర్తి కాగానే పెళ్ళి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారట. ఇక కీర్తి సురేష్ కి కాబోయో భర్త బిజినెస్ మాన్ అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news