బికినీతో రచ్చ చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ..

-

బిగ్‌బాస్ షో గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మూడు సీజన్‌లు పూర్తి అయ్యాయి. శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ మొదటి మూడు సీజన్స్‌లో విజేతగా నిలిచారు. అయితే ఈ మూడు సీజన్స్‌లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. అందులో తమదైన ముద్ర వేసింది మాత్రం కొందరే. మొదటి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా నవదీప్ వచ్చి అందర్నీ ఎంటర్టైన్ చేశాడు. ఇక రెండో సీజన్‌లో పూజా రామచంద్రన్ వచ్చి అందరిని ఆకట్టుకుంది.

వచ్చీ రావడమే అందరితో కలవడం, టాస్కుల్లో మేల్ కంటెస్టెంట్లకు ధీటుగా పార్టిసిపేట్ చేయడం, ఆమె ఫిట్‌నెస్ లెవెల్ ఇలా ప్రతీదాంట్లో ఆమె ప్రత్యేకంగా నిలిచింది. గ్లామర్ టచ్ ఇచ్చి అందర్నీ అట్రాక్ట్ చేసింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గెలిచిన చరిత్ర లేదు. ఓ రెండు మూడు వారాలు అందర్నీ ఎంటర్టైన్ చేసి ఎలిమినేట్ అయిపోయింది.

 

బయటకు వచ్చిన పూజాకు సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు. ఓ రెండు మూడు చిన్న సినిమాల్లో నటించినా అవి అంతగా ఉపయోగపడలేదు. ఇవన్నీ పక్కన పెడితే పూజా మాత్రం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. భర్త జాన్ కొక్కెన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

 

ప్రస్తుతం పూజా తన భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అసలే ఫిట్‌నెస్ మెయింటెన్ చేసే పూజా బికినీ ఫోటోలను షేర్ చేయడంతో.. అందరూ కళ్లప్పగించి చూసేస్తున్నారు. పైగా ఆ తొడలపై ఉన్న టాటూ అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news