నిర్భయ దోషుల ఉరి శిక్ష మళ్ళీ వాయిదా పడే అవకాశాలే కనపడుతున్నాయి. న్యాయపరమైన అవకాశాలు అన్నీ ముగిసిపోయినా సరే ఉరి శిక్ష మాత్రం అమలు కావడం ఈ సారి కష్టంగానే కనపడుతుంది. మార్చి 20న ఉదయం 5.30కి నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చెయ్యాలని, డెత్ వారెంట్ జారీ చేసింది. ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్(31)ని ఉరి శిక్ష అమలు కానుంది.
అయితే ఇప్పుడు మళ్ళీ ఉరి శిక్ష వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. తన లాయర్లు తనను తప్పుదోవ పట్టించారనీ, తనకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాల్నీ తిరిగి కల్పించాలని నిందితుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించాడు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, లాయర్ బృంద గ్రోవర్… నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనీ, దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అతని తరుపు లాయర్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు.
దీనిని సుప్రీం కోర్ట్ గనుక విచారణకు స్వీకరిస్తే మాత్రం ఈ ఉరి శిక్ష వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు సార్లు ఉరి శిక్షను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉరి శిక్ష వాయిదా పడే అవకాశం లేదని, కచ్చితంగా ఉరి తీస్తారని పలువురు అంటున్నారు. ఇప్పటికే నలుగురు దోషులకు న్యాయ, చట్టపరమైన అవకాశాలు అన్నీ ముగిసిపోయాయి.