సచివాలయం కోసం వైఎస్ భారతి రంగంలోకి, అధికారులకు సూచనలు…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో దూకుడుగా వెళ్తుంది. రాజకీయంగా బలంగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చినా సరే ఆయన మాత్రం చెయ్యాలి అనుకున్నది చేస్తున్నారు. ఇక ఇప్పుడు విశాఖలో కాపులప్పాడు కొండపై సచివాలయ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

అయితే ఇప్పటి వరకు రాజధాని వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య భారతి పేరు ఎక్కడా వినపడలేదు. కాని ఇప్పుడు ఆమె అనూహ్యంగా రాజధాని విషయంలో ఎంటర్ అయ్యారనే ప్రచార౦ ఎక్కువగా జరుగుతుంది. ఒక ప్రముఖ వెబ్ సైట్ రాజధాని అంశంలో భారతి కీలక పాత్ర పోషిస్తున్నారు అని కథనం రాసింది. సచివాలయం స్థలం కోసం ఆమె రంగంలోకి దిగారని అంటున్నారు.

కాపులప్పాడు కొండపై ఆమె రాజధాని లో కీలకమైన సచివాలయ భవనం కోసం అధికారులతో మాట్లాడుతున్నారని అంటున్నారు. భవనం ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏ విధంగా ఉండాలి. ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఏయే శాఖలు ఎక్కడ ఉంటే బాగుంటుంది, అనే అనేక విషయాలను ఆమె చర్చిస్తున్నారు. ఇప్పుడు ‘కాపులుప్పాడ కొండ’ తెరపైకి వచ్చింది.

కొండపై 1350 ఎకరాల సువిశాల స్థలంలో కొత్త సచివాలయం నిర్మాణానికి పనులు మొదలైనట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎందుకు రాజధాని విషయంలో తలదూరుస్తున్నారని, ఆమె రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారని కొందరు కామెంట్ చేయడం గమనార్హం. చిన్న విషయానికి కూడా హడావుడి చేసే సోషల్ మీడియా ఈ విషయంలో అదే విధంగా వ్యవహరిస్తుంది. ఆమె అధికారులకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటీ అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news