ఎదపై పూనం కౌర్ టాటూ…! ఎం వేయించుకుందంటే…?

-

చేసిన సినిమాలు పెద్దగా లేకపోయినా సరే పాపులారిటీ మాత్రం పూనం కౌర్ కి బాగానే వచ్చింది. కొన్ని వ్యవహారాలూ, రాజకీయ నాయకుల మీద వ్యాఖ్యలు వంటివి ఆమెకు యెనలేని పాపులారిటి తెచ్చిపెట్టాయి. ఇక సోషల్ మీడియాలో పూనం కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. దీనితో ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె మళ్ళీ వార్తలలో నిలిచింది.

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి, హీరోయిన్ అయిన పూనం కౌర్…. తన శరీరంపై టాటూను వేయించుకుంది. శివుడి ఆయుధమైన త్రిశూలం, ఆయన మెడలోని పామును తన ఎదపై పచ్చబొట్టు వేయించుకుంది. అంతే కాకుండా, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అనేక చర్చలు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.

ఇటీవల తన తల్లి పుట్టినరోజు సందర్భంగా పూనమ్ కౌర్ అమ్మా, నువ్వే నా సర్వస్వం. నా ఎదపై పచ్చబొట్టు పొడిపించుకున్నాను. అందులో ఉన్న త్రిశూలం దుర్గా దేవిని గుర్తు చేస్తుంది. నా దృష్టిలో ప్రతి అమ్మ ఓ దుర్గా దేవే’ అంటూ పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు పూనం చేసిన పని సోషల్ మీడియాలో హాట్ తోపిక్ అయింది. ఏది ఎలా ఉన్నా మరోసారి పూనం వార్తలలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version