అలా ప్రవర్తించడం ఆపండి.. నేను అమాయకురాలిని: పూనమ్ కౌర్

-

సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఓ తలనొప్పి, ఉండకపోతే మరో తలనొప్పి. కొందరు సెలెబ్రిటీలు పెట్టే పోస్ట్‌లకు నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. అయితే వాటిని అలా వదిలేస్తే ఓ పది మందే చూస్తారు.. కానీ వాటిని సదరు సెలెబ్రిటీలు హైలెట్ చేస్తే కొన్ని లక్షల మంది చూస్తారు. అవి వార్తల్లోకెక్కుతాయి. తాజాగా పూనమ్ కౌర్ చేసిన పోస్ట్, వచ్చిన కామెంట్లకు ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారాయి.

పూనమ్ కౌర్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ‘డబ్బు హోదా ఉన్నవాడు రాజు అవ్వొచ్చు గానీ, ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడేవాడు వీరుడవుతాడు. రాజులు శాసిస్తారు.. వీరులు మిమ్మల్ని కాపాడుతారు.శాసించాలి అనే తపన పడే వ్యక్తిలో అహంకారం ఉంటుంది..అందరూ బాగుండాలనే వ్యక్తిలో ప్రేమ, వైరాగ్యం ఉంటుంద’ని ఓ కవిత్వం రాసింది. ఇది తానే రాసినట్టుగా, తన స్నేహితుడు అనువదించినట్టుగా చెప్పుకొచ్చింది. పీకేలవ్, జై హింద్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టేసింది.

అయితే ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లందరూ అభిప్రాయపడ్డారు. జై పవర్ స్టార్ అంటూ ఆమె ట్వీట్‌కు కామెంట్స్ పెట్టసాగారు. అయితే అందులో ఓ నెజిజన్ మాత్రం పూనమ్‌ను బాధపెట్టేలా కామెంట్ చేశాడు. ఆల్రెడీ చేసిన పాపానికి సినిమా ఆఫర్స్ లేక సఫర్ అవుతున్నావ్.. అనుభవిస్తున్నావ్.. అది చాలదా? ఇంకా కావాలా? అని కామెంట్ చేశాడు. దీనికి పూనమ్ రిప్లై ఇస్తూ.. నాతో ఇలా ప్రవర్తించడం ఆపండి నేను అమాయకురాలిని అంటూ రిప్లై ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news