జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ హక్కు మహిళలు వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని అన్నారు. ముఖ్యంగా వేగంగా జనాభా పెరుగుతున్న రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టడం అవసరమని ,అలాంటి రాష్ట్రాల్లో గర్భనిరోధక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
దేశ జనాభా ప్రపంచంలో ఐదో వంతుకు ఉంది. కాబట్టి జనాభా నియంత్రణపై మనం బాధ్యత కలిగి ఉండాలి అని అన్నారు. జనాభాలో 65 శాతం మంది ఉన్న యువత దేశ అభివృద్ధికి కీలకంగా మార్చవచ్చు.వారిలో చైతన్యం కలిగించి జనాభాను నియంత్రించాలి. దేశ యువతలో అవగాహన్ పెరిగితే భవిష్యత్తులో జనాభా పెరగకుండా నియంత్రించగలమని అన్నారు.