పీకే స్క్రిప్ట్‌తో పోసాని… పవన్‌ని బుక్ చేస్తున్నారా?

-

ఏపీ రాజకీయాల్లో నేతల విమర్శలు మరీ హద్దులు దాటేసినట్లు కనిపిస్తోంది. నాయకులు నిర్మాణాత్మకమైన విమర్శలు మానేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టి‌డి‌పి-వైసీపీ నేతలు బూతులు మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కల్యాణ్ సైతం బరస్ట్ అయ్యి, వైసీపీ మంత్రులని సన్నాసులు అంటూ తిట్టేశారు. దీంతో వైసీపీ వాళ్ళు కూడా తీవ్రంగా పవన్‌ని తిడుతున్నారు. ఇదే క్రమంలో పోసాని కృష్ణమురళి కూడా ఎంట్రీ ఇచ్చి పవన్ వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేశారు. పంజాబ్ అమ్మాయికి క‌డుపు చేశావంటూ ప‌రిధి దాటి మాట్లాడాడు పోసాని. నోటికి ఎంతొస్తే అంత మైండ్ కంట్రోల్‌లో లేదేమో అన్నంత‌గా ఆవేశంగా ఊగిపోయాడు.

అయితే ప‌వ‌న్ చేసిన నోరు జార‌డ‌నుకుందాం.. అలాగే పోసాని కూడా.. మామూలుగా రాజకీయంగా పవన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తే సరిపోయేది… కానీ పోసాని కాస్త హద్దు దాటి పంజాబీ అమ్మాయిని మోసం చేసారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో పోసానిపై విరుచుకుపడుతున్నారు. ఆయన కుటుంబాన్ని కూడా బూతులు తిడుతున్నారని తాజాగా ప్రెస్ మీట్‌లో పోసాని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ఫ్యాన్స్‌తో పవనే ఇదంతా చేయిస్తున్నారని అన్నారు.

సరే పోసాని తన ఫ్యామిలీని తిడుతున్నారని ఆవేదన చెందడంలో అర్ధం ఉంది. కాకపోతే పోసాని కూడా పరిధి దాటి పవన్ కుటుంబాన్ని ఇందులోకి తిట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదనే చెప్పొచ్చు. పోసాని కూడా నోటికి వచ్చినట్లు తిట్టేశారు. తన ఫ్యాన్స్‌ని తనపై ఉసిగొల్పారని చెప్పి పవన్‌ని తిట్టారు. కానీ ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి…ఇంతకాలం వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లని ఇష్టారాజ్యంగా విమర్శిస్తూ వచ్చారు. అంటే వారి వెనుక జగన్ ఉన్నారని అనుకోవాలా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

అయితే పోసాని పక్కాగా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్‌ని అమలు చేస్తున్నారని, కంట్రోల్ తప్పి తిట్టి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, పవన్‌తో పాటు ఆయన ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతున్నారని అంటున్నారు. గతంలో శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు ఏ విధంగా పవన్‌ని టార్గెట్ చేశారో తెలుసని, వాళ్ళ ట్రాప్‌లో పడి అభిమానులు జనసేన పార్టీని గాలికొదిలేశారని, దాని వాళ్ళ జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని, ఇప్పుడు పోసాని అదే పనిలో ఉన్నారని, ఆయన ట్రాప్‌లో పడొద్దని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version