తాజాగా నటుడు మరియు దర్శకుడు పోసాని మీడియా సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నాడు. రాజకీయంగా లబ్ది పొందడానికి సొంత కులస్థులను అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పవన్ ను పోసాని ప్రశ్నించారు. కమ్మ కులస్థుడు అయిన చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీని గెలిపించడానికి సొంత కులస్థులను ధుర్బేషలాడడం సమంజసం కాదన్నారు. మొదట్లో చాలా మంచివాడిగా ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబబు తో కలిశాక పిచ్చివాడిలాగా మారిపోయాడన్నారు. చంద్రబాబును సీఎం చేయడానికి ఎందుకు ఇంతలా మారిపోయాడో అర్ధం కావడం లేదన్నారు. అప్పుడు వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు అన్న విషయం నీకు తెలియదా పవన్ కళ్యాణ్.
వంగవీటిని చంపించింది చంద్రబాబే కదా… నీకు తెలియదా పవన్ కళ్యాణ్ !
-