పోస్టాఫీసు స్కీమ్..నెలకు రూ.10 వేలు పెట్టుబడి..16 లక్షలు రాబడి..

-

పోస్టాఫీసు అందిస్తున్న పథకాలు సేఫ్ మరియు సెక్యూర్ ఉంటాయి. అంతేకాదు ఇందులోని స్కీమ్ ల వల్ల మంచి లాభాలను కూడా పొందవచ్చు.. పోస్టాఫీసు పథకాలలో ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి..వీటిలో పెట్టిన పెట్టుబడికి బ్యాంకుల కంటే కూడా ఎక్కువ వడ్డీ వస్తుంది. అంతే కాదు.. ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు ఉంటుంది..

సామాన్య చిన్న తరగతి ప్రజలకి పోస్టాఫీసు పథకాలు అనువుగా ఉంటాయి. అందులో ఒకటి పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా..ఇప్పుడు వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

ఈ పోస్టాఫీసు పథకంలో రూ.10వేలు పెట్టుబడి ద్వారా ఏకంగా రూ. 16లక్షలు పొందొచ్చు. ఈ స్కీం వివరాల్లోకి వెళ్తే.. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా మాదిరిగానే ఉంటుంది. అయితే FDలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.. కానీ దీనిలో అలా కాకుండా.. నెలకు పొదుపు చేయాల్సి ఉంటుంది..

ప్రతీ నెలా కచ్చితమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం 5.8 శాతం వడ్డీని ఇస్తుంది. కాంపౌండింగ్ వడ్డీ ప్రతి మూడో నెలకు కలుపుతారు. 30 సెప్టెంబర్, 2020 నుంచి ఇదే వడ్డీ కొనసాగుతోంది..2018 సంవత్సరంలో దీనిపై అత్యధికంగా 7.3శాతం వడ్డీని చెల్లించారు. ఇలా ప్రతీ నెల రూ.10వేలు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. 10 ఏళ్లకు పెట్టుబడి రూ.12లక్షలు అవుతుంది..దీనికి వడ్డీని కలుపుకుంటే, రూ. 16.26లక్షలు అవుతుంది..రిస్క్ లేకుండా మంచి బెనిఫిట్ ను పొందవచ్చు..పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్..

Read more RELATED
Recommended to you

Exit mobile version