ఆట బొమ్మకు పోస్టుమర్టం.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్ !

-

మహరాష్ట్ర పోలీసులు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. శిశువుకు, బొమ్మకు తేడా తెలియకుండా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు శిశువు అనుకుని ఓ బొమ్మను తీసుకొచ్చి డాక్టర్లకు పోస్టుమార్టం చేయమని ఇచ్చారు. గమ్మత్తేటంటే.. డాక్టర్లు కూడా ఆ బొమ్మను పోస్టుమార్టం చేసి చూస్తే తప్ప అసలు విషయం తెలియదు. అది శిశువు కాదు అదొక బొమ్మని. ఈ విషయం తెలిసి అందరూ నవ్వుకున్నారు.

doll

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర బుల్డానా జిల్లా ఖాంగావ్ మండలం, బోర్జావాల్ గ్రామ సమీపంలో ఉన్న ఓ నదిలో జూలై 9న ఓ శిశువు పార్థివదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శిశువు మరణించాడని నిర్ధారించి పోస్టుమార్టం నిమిత్తం ఖుంగావ్ లోకి ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. పిల్లాడికి 7, 8 నెలల వయస్సు ఉంటుందని, శిశువును ఎవరైనా నదిలో పారేశారా? లేక చంపేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టడం మొదలు పెట్టారు.నిందితుడు దొరికితే పట్టుకుని వాడిని కఠినంగా శిక్షించాలంటే శిశువు ఎలా చనిపోయిందో తెలియాలని అనుకున్నారు. శిశువు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తు కూర్చున్నారు.

పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు పోలీసుల దగ్గరికి వచ్చి దిమ్మ తరిగే విషయం చెప్పారు. పోలీసులు ఆ మాట విని అందరూ నివ్వెరబోయారు. పోలీసులు తీసుకువచ్చింది శిశువును కాదని, అచ్చం శిశువులా కనిపించే ఆటబొమ్మని తెలిసి తెల్ల మొహం పెట్టారు. బొమ్మకు, శిశువుకు తేడా తెలియకుండా పోలీసులు ఎలా అయ్యారని స్థానికులు ఏం అనుకుంటారో అని, ఈ విషయం బయట తెలిస్తే నవ్వులపాలు అవుతామని భావించి తెగ బాధపడ్డారు. కానీ ఈ విషయంలో అందరి చెవిన పడడంతో స్థానికులు నవ్వుకుంటున్నారు. నిజంగా బొమ్మకు, పిల్లాడికి తేడా లేకుండా వీళ్లేం పోలీస్ ఉద్యోగం చేస్తున్నారని పలువురు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version