హార‌ర్ కామెడీ క‌థ‌కు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ !

-

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ బిజి గా ఉన్నాడు. రాధేశ్యామ్, స‌లార్, ఆది పురుష్ సినిమాలు షూటింగ్ లు జ‌రుపుకుంటున్నాయి. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్, నాగ్ అశ్విన్ ద‌ర్శక‌త్వంలో ప్రాజెక్టు కె సినిమాల‌ను కూడా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేస్తున్నాడు. ఇప్ప‌టి కే ఈ సినిమాల గురించి అధికారిక ప్ర‌క‌ట‌నలు వ‌చ్చాయి. అయితే ప్ర‌భాస్ తాజా గా మ‌రో సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

యంగ్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శక‌త్వంలో ఒక హార‌ర్ కామెడీ కథ కు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని స‌మాచారం. కాగ ఈ సినిమా ను ఈ ఏడాది వేస‌వి త‌ర్వాత‌ ప‌ట్టాల పైకి ఎక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తుంది. కాగ ఈ సినిమా పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌టన రాలేదు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గ‌తంలో రెండు సంవ‌త్సరాలకు ఒక సినిమా వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రూట్ మార్చాడు. వ‌రుస‌గా సినిమాల‌కు ఓకే చెబుతూ షూటింగ్ ల‌లో పాల్గొంటున్నాడు. ఒకే ఏడాదిలో క‌నీసం రెండు నుంచి మూడు సినిమాల‌ను విడుద‌ల చేయాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అందుకే ఒప్పుకున్నాడ‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news