రిపబ్లిక్ వేడుకల వేళ భారీ విధ్వంసానికి వ్యూహ రచనలు చేస్తున్నాయి టెర్రరిస్ట్ గ్రూపులు. ఇప్పటికే ఉగ్రదాడులపై నిఘా వ్యవస్థలు రాష్ట్రాలను అలెర్ట్ చేశాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెబడవచ్చని ఐబీ హెచ్చిరిస్తోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ గురుదాస్ పూర్ లో ఓ గ్రెనెడ్ లాంఛర్, 3.79 కిలోల ఆర్డీఎక్స్, 9 డిటోనేటర్లు, 2 సెట్ల టైమర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ చెందిన సిక్ యూత్ ఫెడరేషన్ నుంచి ఈ పేలుడు పదార్థాలు భారత్ కు చేరి ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. టెర్రరిస్టులతో లింకులు ఉన్నా మల్కీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రిపబ్లిక్ వేడుకల సమయంలో భారత్ లో విధ్వంసం కలిగించేందుకు జైష్ ఏ మహ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్, లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఓ ప్రాంతంలో కూడా పేలుడు పదార్థాలు దొరకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే భద్రతా బలగాలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు నిఘాను పటిష్ట పరుస్తున్నాయి.